![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -327 లో.... శ్రీవల్లి నగలన్నీ వేసుకొని మురిసిపోతుంటే అప్పడే తిరుపతి వస్తాడు. ఎక్కడ ఇవి ప్రేమ నగలు అని గుర్తుపడతాడోనని శ్రీవల్లి కొంగు కప్పుకుంటుంది. శ్రీవల్లి నీ గురించి ఈ రోజు నువ్వు అంటే ఏంటో తెలిసిందని తిరుపతి అనగానే నగలు చూసేసాడా ఏంటని శ్రీవల్లి భయపడుతుంది. నీ పద్దతి గురించి అంటున్నానని తిరుపతి అనగానే శ్రీవల్లి రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఈ నగలు ఇలా చాటుగా వేసుకొని మురిసిపోవడం తప్ప ఏం చేసేది లేదని నగలన్నీ తీసి దాచేస్తుంది.
ఆ తర్వాత భద్రవతి ఇంటికి మార్వాడి అతను వస్తాడు. మెరుగు పెట్టించమంటే ఇలా తీసుకొని వచ్చారని రేవతి అంటుంది. ఇవి బంగారం కాదు గిల్టీ నగలు అని మార్వాడి అనగానే అందరు షాక్ అవుతారు. ఈ నగలు ఎవరైనా తీసారా అని భద్రవతి అడుగుతుంది. తిరుపతి ఇచ్చాక అవి అలాగే తీసుకొని వచ్చి బీరువాలో పెట్టానని రేవతి అంటుంది. ఇప్పుడు అర్థం అయింది. ఈ నగలన్నీ తీసుకొని గిల్టీ నగలు ఆ రామరాజు పెట్టాడన్నమాట అని అందరు అనుకుంటారు.
ఆ తర్వాత భద్రవతి కుటుంబం మొత్తం రామరాజు ఇంటికి గొడవకి వెళ్తారు. గిల్టీ నగలు పెట్టి మమ్మల్ని మోసం చేసావని సేనాపతి గొడవ పడుతాడు. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. ఏం చేస్తావో నాకు తెలియదు.. నిజమైన బంగారు నగలు నాకు తీసుకొని రావాలని రామరాజుకి భద్రవతి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అసలు నగలు ఏమైయ్యాయని రామరాజు ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. వాటికి సంబంధించి మొత్తం ప్రేమకి తెలుసు.. ఇప్పుడు తను పోలీస్ అవ్వాలని అనుకుటుంది కదా అందుకే వాటిని అమ్మేశారేమోనని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |